శ్యామ్‌ పిట్రోడా ఫోన్‌, ల్యాప్‌టాప్‌ హ్యాక్‌

వేలాది డాలర్లు చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్న హ్యాకర్లు

Advertisement
Update:2024-12-07 11:18 IST

తనను హ్యాకర్లు వేదిస్తున్నారని.. వేల డాలర్లు చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నారని ఓవర్సీస్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు శామ్‌ పిట్రోడా ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ తెలిపారు. తన ఫోన్‌తో పాటు ల్యాప్‌టాప్‌ను హ్యాక్‌ చేసి క్రిప్టో కరెన్సీ రూపంలో తమకు వేల డాలర్లు చెల్లించాలని వేదింపులకు గురి చేస్తున్నారని తెలిపారు. తాము అడిగినంత ఇవ్వకుంటే పరువు, ప్రతిష్టను దెబ్బతీస్తామని హెచ్చరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తన పేరుతో ఎలాంటి మెయిళ్లు, మెసేజ్‌లు వచ్చినా రియాక్ట్‌ కావొద్దని, లింక్‌లు క్లిక్‌ చేయొద్దని తన సన్నిహితులు, ప్రజలను కోరారు. తన ఫోన్‌, ల్యాప్‌ టాప్‌, సర్వర్‌ హ్యాక్‌ అయినా తాను విదేశీ పర్యటనలో ఉన్నందున వెంటనే బ్లాక్‌ చేయలేకపోయానని తెలిపారు. గుర్తు తెలియని నంబర్ల నుంచి తన పేరుతో వచ్చే మెసేజ్‌లు, లింక్‌లు ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్‌ చేయొద్దని విజ్ఞప్తి చేశారు.

Tags:    
Advertisement

Similar News