సంధ్య థియేటర్‌ ఘటన.. ముగ్గురి అరెస్ట్‌

ఆశాజనకంగా ఉన్న బేగంపేట కిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ పరిస్థితి

Advertisement
Update:2024-12-08 23:16 IST

సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి ముగ్గురిని అరెస్టు చేసినట్లు చిక్కడపల్లి ఏసీపీ రమేశ్‌ కుమార్‌ తెలిపారు. ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లోని సంధ్య థియేటర్‌ వద్ద ఈ నెల 4వ తేదీ రాత్రి పుష్ప-2 బెనిఫిట్‌ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు శ్రీతేజ తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. మృతురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు సినీ నటుడు అల్లు అర్జున్‌తో పాటు సంధ్య థియేటర్‌ యాజమాన్యంపై వివిక్ష సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

బేగంపేట కిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ పరిస్థితి ఆశాజనకంగా ఉన్నదని ఏసీపీ తెలిపారు. భగవంతుడి దయతో బాలుడు పూర్తిగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. సంధ్య థియేటర్‌కు సంబంధించి పత్రాలను క్షుణ్నంగా పరిశీలించాం. థియేటర్‌ యాజమాన్యంలో ఎనిమిది మంది పార్టనర్స్‌ ఉన్నారు. వీరిలో ప్రతి ఒక్కరూ ఘటనకు బాధ్యులే. యజమానుల్లో ఒకరైన సందీప్‌, లోయర్‌ బాల్కనీ, అప్పర్‌ బాల్కనీ ఇన్‌ఛార్జి విజయ్‌ చందర్‌, సీనియర్‌ మేనేజర్‌ నాగరాజును అరెస్టు చేసి ఇప్పటికే చంచల్‌గూడ జైలుకు రిమాండ్‌ తరలించామని ఏసీపీ తెలిపారు. 

Tags:    
Advertisement

Similar News