ఆ పని చేస్తే సల్మాన్ ఖాన్ ను ప్రాణాలతో వదిలేస్తాం
బిష్ణోయ్ కమ్యూనిటీ సంచనల ప్రకటన
కృష్ణజింకలను వేటాడిన కేసులో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ బహిరంగ క్షమాపణ చెప్తే ప్రాణాలతో వదిలేస్తామని బిష్ణోయ్ కమ్యూనిటీ, లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సంచలన ప్రకటన చేసింది. ఎన్సీపీ నేత, మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీని హత్య చేసింది తామేనని ప్రకటించి బిష్ణోయ్ గ్యాంగ్.. సల్మాన్ ఖాన్ ను విడిచి పెట్టేది లేదని తేల్చిచెప్పింది. సిద్దిఖీ హత్య తర్వాత అలర్ట్ అయిన ముంబయి పోలీసులు సల్మాన్ ఖాన్ కు రక్షణ పెంచింది. సిద్దిఖీపై కాల్పుల గురించి తెలుసుకున్న సల్మాన్ ఖాన్ బిగ్ బాస్ షూటింగ్ మధ్యలోనే వదిలేసి హుటాహుటిన ఆస్పత్రికి వెళ్లారు. అప్పటికే సిద్ధిఖీ మృతిచెందడంతో మృతదేహం వద్ద నివాళులర్పించి తిరిగి వెళ్లిపోయారు. బిష్ణోయ్ వర్గానికి కృష్ణజింకలు దైవంతో సమానం.. హమ్ సాత్ సాత్ హై సినిమా షూటింగ్ కోసం సల్మాన్ ఖాన్ తో పాటు పలువురు నటులు రాజస్థాన్ కు వెళ్లారు. ఆ సమయంలో సల్మాన్ ఖాన్ కృష్ణజింకలను వేటాడార. ఈ కేసులో సల్మాన్ ఖాన్ ను కోర్టు దోషిగా ప్రకటించింది. ఆ తీర్పుపై రాజస్థాన్ హైకోర్టులో సల్మాన్ ఖాన్ అప్పీల్ చేశారు. తమకు దైవంతో సమానమైన కృష్ణజింకలను సల్మాన్ ఖాన్ చంపాడని.. ఆయనను ఎలాగైనా చంపేస్తామని బిష్ణోయ్ గ్యాంగ్ గతంలోనే ప్రకటించింది. ఆయన ఇంటి వద్ద రెక్కీ కూడా నిర్వహించింది. కృష్ణజింకలను చంపడంపై సోమీ అలీ క్షమాపణలు చెప్పడం కాదు.. స్వయంగా సల్మాన్ ఖాన్ క్షమాపణ చెప్పాలని బిష్ణోయ్ కమ్యూనిటీ ఆల్ ఇండియా అధ్యక్షుడు దేవేంద్ర బుధియా ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ఎలాంటి తప్పు చేయని సోమి క్షమాపణను అంగీకరించబోమని కుండబద్దలు కొట్టారు. సల్మాన్ గుడికి వచ్చి స్వయంగా క్షమాపణ చెప్తే ఆ తర్వాత అతడికి విధించే శిక్ష గురించి ఆలోచన చేయవచ్చని పేర్కొన్నారు.