రూ. 6 వేల కోట్ల పోంజీ స్కామ్‌ నిందితుడు అరెస్ట్‌

బ్యాంకుల కంటే ఎక్కువ వడ్డీ ఇస్తామని ప్రజలను మోసం చేసిన భూపేంద్రసింగ్‌ ఝలా

Advertisement
Update:2024-12-28 11:49 IST

బ్యాంకుల కంటే ఎక్కువ వడ్డీ ఇస్తామని ప్రజలను మోసం చేసి.. రూ. 6 వేల కోట్ల పోంజీ స్కామ్‌కు పాల్పడిన నిందితుడిని పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్‌ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఫైనాన్షియల్‌ సర్వీస్‌, బీజెడ్‌ గ్రూప్‌ సీఈవో భూపేంద్రసింగ్‌ ఝలా అనే వ్యక్తి తమ సంస్థ ద్వారా బ్యాంకుల కంటే అధిక వడ్డీ రేటు ఇస్తామని గుజరాత్‌లోని పలు ప్రాంతాల ప్రజలను నమ్మించారు. కొంతకాలం తర్వాత సంస్థ పనితీరుపై అనుమానం రావడంతో ఈ విషయంపై మూడు నెలల కిందట కొందరు వ్యక్తులు సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది.

ఫైనాన్షియల్‌ సర్వీస్‌ సంస్థకు చెందిన గాంధీనగర్‌, ఆరావళి, సబర్‌కాంత, మెహసానా, వడోదరలోని ఆఫీసులపై దర్యాప్తు సంస్థ అధికారులు దాడులు చేశారు ఈ కేసులో ఇప్పటివరకు సంస్థకు చెందిన 10 మందికి పైగా ఏజెండ్లను అధికారులు అరెస్టు చేశారు. నాటి నుంచి గ్రూప్‌ సీఈవో భూపేంద్రసింగ్‌ ఝలా పరారీలో ఉండటంతో అతనిపై లుకౌట్‌ నోటీసులు జారీ చేశారు. గుజరాత్‌లోని మెహనాసా జిల్లాలోని ఓ ఫామ్‌హౌస్‌లో అతను దాక్కున్నట్లు సీఐడీ అధికారులకు సమాచారం అందడంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు.

ఈ కేసుపై దర్యాప్తు సాగుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. నిందితుడు ముందస్తు బెయిల్‌ కోసం దరఖాస్తు చేసుకున్న పిటిషన్‌ను స్థానిక కోర్టు కొట్టివేసినట్లు తెలిపారు. ప్రజల డబ్బుతో నిందితులు పలు విలాసవంతమైన కార్లు, భవనాలు కొనుగోలు చేసినట్లు, వివిధ విద్యాసంస్థల్లో పెట్టుబడులు పెట్టినట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు.

Tags:    
Advertisement

Similar News