అన్నా వర్సిటీ అత్యాచార బాధితురాలికి రూ.25 లక్షల పరిహారం

ఆదేశించిన మద్రాస్‌ హైకోర్టు

Advertisement
Update:2024-12-28 17:00 IST

చెన్నైలోని అన్నా యూనివర్సిటీలో అత్యాచారానికి గురైన బాధితురాలికి రూ.25 లక్షల పరిహారం అందజేయాలని మద్రాస్‌ హైకోర్టు తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. అత్యాచార ఘటనపై విచారణను సీబీఐకి అప్పగించాలంటూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది. ఈ ఘటనపై విచారణకు స్పెషల్‌ ఇన్వెష్టిగేషన్‌ టీమ్‌ (సిట్‌) ఏర్పాటు చేయాలని, ముగ్గురు సభ్యులు ఉండే ఆ సిట్‌లో అందరూ మహిళా ఐపీఎస్‌ అధికారులే ఉండాలని స్పష్టం చేసింది. ఈ ఘటన విద్యార్థిని చదువుపై ప్రభావం చూపకుండా చర్యలు చేపట్టాలని, ఆమె నుంచి ఫీజులు కూడా వసూలు చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది. అన్నా యూనివర్సిటీలో ఇంజనీరింగ్‌ చదువుతున్న విద్యార్థి ఈనెల 23న తన స్నేహితుడితో మాట్లాడుతుండగా ఇద్దరు వ్యక్తులు ఆమె స్నేహితుడిపై దాడి చేసి విద్యార్థినిపై అత్యాచారం చేశారు. ఆమెను ఫొటోలు తీసి వాటిని సోషల్‌ మీడియాలో పెడుతామని బెదిరింపులకు గురి చేశారు. బాధితురాలి ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన చెన్నై పోలీసులు సీసీ కెమెరాలో రికార్డ్‌ అయిన వీడియోల ఆధారంగా ఒక యువకుడిని అరెస్ట్‌ చేశారు. మరో నిందితుడి కోసం వెదుకుతున్నారు. అత్యాచారానికి పాల్పడిన వ్యక్తి డీఎంకే నాయకుడని, అతడిని తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై ఆరోపించారు. డీఎంకేను గద్దె దించే వరకు తాను చెప్పులు వేసుకోనని ఆయన శపథం చేశారు.

Tags:    
Advertisement

Similar News