పోర్న్‌ కంటెంట్‌ కేసులో రాజ్‌కుంద్రాకు ఈడీ సమన్లు?

సోమవారం ఉదయం ఈడీ ఆయనను ప్రశ్నించనున్నట్లు సమాచారం

Advertisement
Update:2024-12-01 13:34 IST

పోర్న్‌ మూవీస్‌ నిర్మాణం, ప్రసారం కేసులో బాలీవుడ్‌ నటి శిల్పాశెట్టి భర్త, ప్రముఖ వ్యాపారవేత్త రాజ్‌కుంద్రా కొంతకాలంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణలో భాగంగా ఈడీ ఆయనకు సమన్లు జారీ చేసినట్లు తాజాగా వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు సోమవారం ఉదయం ఆయనను ప్రశ్నించనున్నట్లు సమాచారం. ఈ కేసుతో ఎవరెవరికి సంబంధాలున్నాయనే విషయాన్ని తెలుసుకోనున్నది. మరోవైపు రాజ్‌కుంద్రాతో పాటు ఈ కేసుతో సంబంధం ఉన్న మరికొంతమందికి కూడా నోటీసులు అందాయని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

మనీలాండరింగ్‌ కేసులో భాగంగా రాజ్‌కుంద్రాకు చెందిన ఇళ్లు, ఆఫీసుల్లో ముంబై, ఉత్తరప్రదేశ్‌లోని సుమారు 15 ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయని నిన్న జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. మొబైల్ అప్లికేషన్‌ ద్వారా అశ్లీల కంటెంట్ నిర్మాణం , పంపిణీకి సంబంధించిన ఆరోపణలకు సంబంధించిన మనీ-లాండరింగ్ కేసులో ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు ఆ కథనాలు పేర్కొన్నాయి. పోర్న్ ప్రొడక్షన్‌కు సంబంధించి ఆరోపణలపై 2021లో కుంద్రాపై ఈడీ విచారణ చేస్తున్నది. 2021 జూలైలో ఇండియన్ పీనల్ కోడ్ ,ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్‌లోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన ముంబై క్రైమ్ బ్రాంచ్ రాజ్ కుంద్రా అరెస్టు చేసింది. దాంతో కొన్ని నెలల పాటు జైల్లో ఉండాల్సి వచ్చింది. ఈ కేసులో కుంద్రా ప్రధాన నిందితుడని పోలీసు అధికారులు వెల్లడించారు. అప్పట్లో దాఖలైన ఛార్జ్‌షీట్‌లో.. సినిమా అవకాశాల కోసం ముంబయికి వచ్చే యువతులను వంచించి ఆయన పెద్దఎత్తున ఆర్జించినట్లు పేర్కొన్నారు. అయితే ఈ కేసుతో శిల్పాశెట్టికి సంబంధం లేదని ఆమె తరఫు లాయర్‌ అన్నారు. ఈడీ సోదాలు జరగలేదన్నారు. రాజ్‌కుంద్రాకు సంబంధించిన కేసు విచారణ కొనసాగుతున్నదని, ఆయన కూడా అధికారులకు సహకరిస్తున్నారని చెప్పారు. ఈడీ సోదాలు జరుగుతున్నట్లు ప్రచారమవుతున్న వార్తల్లో శిల్పాశెట్టి ఫొటోలు, వీడియోలు ఉపయోగించవద్దని కోరారు. ఆమెకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదన్నారు. ఒకవేళ ఆమె ఫొటోలు వినియోగిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఈడీ సోదాలను ఉద్దేశించి రాజ్‌కుంద్రా ఇన్‌స్టాలో పోస్ట్‌ పెట్టారు. నిజమే గెలుస్తుందన్నారు. 'దయచేసి నిజాలను మాత్రమే ప్రచారం చేయండి. నాలుగేళ్ల నుంచి ఈ కేసుల విషయంలో విచారణలు జరుగుతున్నాయి. నేను సహకరిస్తూనే ఉన్నాను. ఎంతటి సంచలనాత్మక కేసుల్లోనైనా చివరికి న్యాయమే గెలుస్తుంది. సంబంధంలేని విషయాల్లో నా భార్య పేరును పదే పదే ఉపయోగించడం ఏమాత్రం ఆమోదయోద్యం కాదని పేర్కొన్నారు.

Tags:    
Advertisement

Similar News