పట్నం నరేందర్‌రెడ్డికి హైకోర్టులో ఊరట

ఆయనపై నమోదైన మూడు ఎఫ్‌ఐఆర్‌లలో రెండింటిని కొట్టేసిన హైకోర్టు

Advertisement
Update:2024-11-29 10:56 IST

లగచర్ల ఘటనలో అరెస్టై చర్లపల్లి జైలులో ఉన్న కొడంగల్‌ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై నమోదైన మూడు ఎఫ్‌ఐఆర్‌లలో హైకోర్టు రెండింటిని కొట్టివేసింది. ఇందులో 153, 154, 155 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. ఒకే ఘటనపై వేర్వేరు కేసులు నమోదు చేయడం పట్నం తరఫున లాయర్‌ హైకోర్టులో పిటిషన్‌ వేసిన సంగతి తెలిసిందే. లగచర్ల ఘటనలో పట్నం నరేందర్‌రెడ్డిపై బొంరాస్‌పేట పోలీసులు మూడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ కె. లక్ష్మణ్‌ గత వారం విచారణ నిర్వహించారు. ఈ సందర్బంగా పిటిషనర్‌ తరఫున న్యాయవాది రమణ వాదనలు వినిపించారు.ఒకే ఘటనలోవేర్వేరు కేసులు పెట్టవద్దని సుప్రీంకోర్టు తీర్పును పిటిషనర్‌ కోర్టులో ప్రస్తావించారు.ఒకే ఘటనలో ఒకటికంటే ఎక్కువ ఎఫ్‌ఐఆర్‌లను ఇదే హైకోర్టు తప్పుపట్టి, కొట్టివేసిన విషయాన్ని ఈ సందర్బంగా పిటిషర్‌ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. దాడి ఆధారంగా వేర్వేరు కేసులు నమోదు చేశారని ప్రభుత్వ అడిషనల్‌ అడ్వకేట్‌ జనరల్‌ కోర్టుకు తెలిపారు. ఈ కేసులో అరెస్టైన నిందితులు ఇచ్చిన ఆధారంగా సెక్షన్ల కింద ఇతర ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేశారని వాదించారు.ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు తీర్పు రిజర్వు చేసి నేడు వెలువరించింది.నరేందర్‌రెడ్డి తరఫు లాయర్‌ వాదనలో ఏకీభవించిన హైకోర్టు మూడు ఎఫ్‌ఐఆర్‌లలో రెండింటిని కొట్టివేస్తూ ఉత్తర్వులు వెలువరించింది.



Tags:    
Advertisement

Similar News