ఆప్ ఎమ్మెల్యే గుర్‌ప్రీత్ గోగి అనుమానాస్పద మృతి
అది ప్రమాదమా? హత్యా? లేదా ఆత్మహత్యా అన్నది నిర్ధారణ కావాల్సి ఉన్నది.
Advertisement
పంజాబ్‌లోని లూథియానా పశ్చిమ నియోజకవర్గం ప్రాతినిధ్యం వహిస్తున్న ఆప్ ఎమ్మెల్యే గుర్‌ప్రీత్ గోగి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఎమ్మెల్యే గోగికి శుక్రవారం బుల్లెట్ గాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలించే లోపే ఆయన ప్రాణాలు కోల్పోయారు. గోగి తలలో రెండు బుల్లెట్లు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ప్రమాదవశాత్తూ తుపాకీ పేలిందని కుటుంబసభ్యులు తెలిపారు. ప్రమాదవశాత్తూ తుపాకీ పేలితే రెండు బుల్లెట్లు ఎందుకు దూసుకెళ్తాయనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. అది ప్రమాదమా? హత్యా? లేదా ఆత్మహత్యా అన్నది నిర్ధారణ కావాల్సి ఉన్నది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 2022లో ఆప్‌లో చేరిన గోగి లూథియానా నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
Advertisement