అథ్లెట్ల్‌పై 60 మందికిపైగా అత్యాచారం

కేరళలో దారుణం. 62 మంది అనుమానితులను గుర్తించిన పోలీసులు.. వీరిలో 40 మంది పాక్సో చట్టం కింద కేసులు నమోదు

Advertisement
Update:2025-01-11 13:57 IST

కేరళలో అమానవీయ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. 18 ఏళ్ల అథ్లెట్‌పై 60 మందికి పైగా వ్యక్తులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఐదేళ్లుగా ఈ దారుణాలు అనుభవిస్తూ వచ్చిన ఆ యువతి.. చివరికి ఛైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ ముందు తన ఆవేదనను పంచుకోవడంతో ఈ అమానుషం బైటికి వచ్చింది. దీంతో పథనంథిట్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

13 ఏళ్ల ప్రాయంలోనే తనపై అత్యాచారం జరిగిందని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నది. ఆ సమయంలో తన పొరుగింట్లో ఉన్న ఓ వ్యక్తి తనను కొండల ప్రాంతానికి తీసుకెళ్లాడని, అక్కడ స్నేహితులతో కలిసి అత్యాచారానికి ఒడిగట్టాడని వాపోయింది. ఆ తర్వాత పలువురు కోచ్‌లు, తోటి ఆటగాళ్లు కూడా తనపై పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని తెలిపింది. భయంతోనే ఇన్నాళ్లు ఈ విషయం బైటపెట్టలేదని పేర్కొన్నది.

దీంతో పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. 62 మంది అనుమానితులను గుర్తించారు. వీరిలో 40 మంది పాక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. ఇప్పటివరకు ఆరుగురు నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలని ప్రస్తుతం షెల్టర్‌ హోమ్‌కు తరలించారు. కేసుపై దర్యాప్తు కొనసాగుతున్నదని, బాధితురాలికి అన్నివిధాలా అండగా ఉంటామని ఛైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ వెల్లడించింది.

Tags:    
Advertisement

Similar News