ఏసీబీ విచారణకు హాజరైన బీఎల్‌ఎన్‌రెడ్డి
ఫార్ములా ఈ-రేస్ కేసులో ఇప్పటికే కేటీఆర్, అర్వింద్ కుమార్‌లను విచారించిన ఏసీబీ అధికారులు
ఫార్ములా ఈ-రేస్ కేసులో బీఎల్‌ఎన్ రెడ్డి ఏసీబీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. రేస్ సమయంలో ఆయన హెచ్‌ఎండీఏ చీఫ్ ఇంజినీర్‌గా ఉన్నారు. హెచ్‌ఎండీఏ ఖాతా నుంచి విదేశీ సంస్థకు నగదు బదిలీ వ్యవహారంపై ఏసీబీ ఆరా తీస్తున్నది. ఈ కేసులో బీఎల్‌ఎన్ రెడ్డి ఏ3గా ఉన్నారు. ఇప్పటికే మాజీ మంత్రి కేటీఆర్, ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్ ఏసీబీ అధికారి అర్వింద్‌కుమార్ ఏసీబీ అధికారులు విచారించారు.
మనీలాండరింగ్, ఫెమా నిబంధనల ఉల్లంఘన అభియోగాల నేపథ్యంలో బీఎల్‌ఎన్ రెడ్డిని ఈడీ అధికారులు బుధవారం ఎనిమిదిన్నర గంటల పాటు విచారించారు. ఈడీ విచారణ తర్వాత నేడు ఆయన ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఇదే కేసులో ఇప్పటికే ఏసీబీ విచారణకు హాజరైన ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా బీఎల్‌ఎన్‌రెడ్డిపై ప్రశ్నలు సందించే అవకాశం ఉన్నది.