ఎయిమ్స్ లో చేరిన చోటా రాజన్
సైనస్ ఆపరేషన్ కోసం చేరినట్టు చెప్పిన డాక్టర్
Advertisement
అండర్ వరల్డ్ డాన్ చోటా రాజన్ ఢిల్లీలోని ఎయిమ్స్ హాస్పిటల్ లో చేరాడు. సైనస్ తో బాధపడుతున్న చోటా రాజన్ ను జైలు అధికారులు ఎయిమ్స్ చేర్పించారు. ఆయనకు ఆపరేషన్ చేయాల్సి ఉందని డాక్టర్లు వెల్లడించారు. చోటా రాజన్ తిహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. అతడి అసలు పేరు రాజేంద్ర సదాశివ్ నికల్జే.. 2015లో ఇండోనేషియాలోని బాలిలో అక్కడి పోలీసులు రాజన్ ను అరెస్టు చేశారు. ఆ తర్వాత భారత్ కు రప్పించారు. వ్యాపారి జయశెట్టి హత్య కేసులో న్యాయస్థానం రాజన్ కు జీవిత ఖైదు విధించింది. జర్నలిస్టు జేడే హత్య కేసులో ఆరేళ్ల జైలు శిక్ష విధించింది.
Advertisement