ఆగి ఉన్న లారీని ఢీకొన్న బస్సు... ఐదుగురు మృతి

సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం ఐలాపురం వద్ద జరిగిన ఘటన

Advertisement
Update:2025-01-10 11:48 IST

సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న ఇసుక లారీని ప్రైవేట్‌ బస్సు ఢీ కొన్న ఘటనలో మృతుల సంఖ్య ఐదుకు చేరింది. ఈ ప్రమాదంలో మరో 16 మందికి గాయాలయ్యాయి. ఒడిషా నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న ప్రైవేట్‌ బస్సు తెల్లవారుజామున 4 గంటల సమయంలో సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం ఐలాపురం వద్ద ఆగి ఉన్న ఇసుక లారీని ఢీ కొట్టింది. దీంతో బస్సు ముందు భాగం నుజ్జునుజ్జు అయిపోయింది. డ్రైవర్‌ సీటు తో పాటు సుమారు ఆరు సీట్ల వరకు ఢీకొట్టిన సమయంలో ఎగిసిపడి లోపలి భాగమంతా నుజ్జునుజ్జు అయ్యింది. ఈ ప్రమాదంలో అక్కడిక్కడికే డ్రైవర్‌ సహా ముగ్గురు మృతి చెందగా.. ఒకరు తెల్లవారు జామున, మరొకరు హైదరాబాద్‌కు చికిత్స కోసం తరలిస్తుండగా చనిపోయారు. ఈ ఘటనలో నలుగురు వలస కూలీలు మృతి చెందారు. వారంతా ఒడిషాకు చెందిన వారు. బస్సులో మొత్తం 32 మంది ప్రయాణికులు ఉన్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స కోసం సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. భారీ క్రేన్‌ సాయంతో బస్సును రోడ్డు పక్క నుంచి తొలిగించారు. 

Tags:    
Advertisement

Similar News