పాడి కౌశిక్‌రెడ్డికి నోటీసులు జారీ
గురువారం విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్న మాసబ్ ట్యాంక్ పోలీసులు
Advertisement
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి మాసబ్ ట్యాంక్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. గురువారం విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. కరీంనగర్ కోర్టుకు హాజరుకాల్సి ఉందని, విచారణకు ఈనెల 17న హాజరవుతానని కౌశిక్‌రెడ్డి తెలిపారు. బంజారాహిల్స్ ఇన్‌స్పెక్టర్ విధులు అడ్డుకోవడం, బెదిరింపుల వ్యవహారంలో ఇన్‌స్పెక్టర్ రాఘవేందర్ ఫిర్యాదు మేరకు గతంలో కౌశిక్‌రెడ్డిపై కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి మాసబ్‌ట్యాంక్ ఇన్‌స్పెక్టర్ పరుశురామ్‌ను దర్యాప్తు అధికారిగా డీసీపీ విజయ్‌కుమార్ నియమించారు.
Advertisement