మాసబ్‌ట్యాంక్ పీఎస్‌లో విచారణకు హాజరైన కౌశిక్‌రెడ్డి
బంజారాహిల్స్ ఇన్‌స్పెక్టర్ విధులకు ఆటంకం కలిగించారని కౌశిక్‌రెడ్డి పై కేసు నమోదు
Advertisement
హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాసబ్ ట్యాంక్ పోలీస్‌స్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు. తన న్యాయవాదితో కలిసి పీఎస్ లోపలికి వెళ్లారు.బంజారాహిల్స్ ఇన్‌స్పెక్టర్ విధులకు ఆటంకం కలిగించిన కేసులో కౌశిక్‌రెడ్డిని విచారించారు. గత ఏడాది డిసెంబర్ 4న ఫోన్ ట్యాపింగ్ జరిగిందని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి కౌశిక్‌రెడ్డి వెళ్లారు. సీఐ వాహనానికి తన వాహనం అడ్డుపెట్టి అనుచరులతో విధులకు ఆటంకం కలిగించారని పోలీసులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కౌశిక్‌రెడ్డిపై కేసు నమోదు చేశారు.
Advertisement