జైపూర్ లో భారీ అగ్ని ప్రమాదం..ఐదుగురు మృతి

ఈ ఘటనలో 37 మందికి గాయాలు

Advertisement
Update:2024-12-20 10:32 IST

రాజస్థాన్లోని జైపూర్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సుమారు ఐదుగురు మృతి చెందినట్లు సమాచారం. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం తెల్లవారుజామున 5.30 గంటలకు జైపూర్ -అజ్మీర్ హైవేపై ఎల్పీజీ ట్యాంకర్ను, ఓ ట్రక్కు ఢీకొట్టింది. దీంతో గ్యాస్ ట్యాంకర్లో మంటలు చెలరేగి దగ్గర ఉన్న పెట్రోల్ బంకు కు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో పలు వాహనాలు దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా.. 37 మంది గాయపడ్డారు.

సమాచారం అందుకున్న వెంటనే 20 ఫైర్ ఇంజిన్ యంత్రాలతో సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలార్పే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలోనే బంకు నుంచి పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ట్యాంకర్ ను ఢీ కొట్టిన ట్రక్కులో మండే రసాయనాలు ఉన్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. బాధితులను దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. సీఎం భజన్ లాల్ శర్మ ఆస్పత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు. అనంతరం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా సీఎంతో ఫోన్ లో మాట్లాడి ప్రమాదానికి సంబంధించిన వివరాలపై ఆరా తీశారు.

Tags:    
Advertisement

Similar News