మల్లోజుల సహచరి లొంగుబాటు

మహారాష్ట్ర సీఎం ఎదుట లొంగిపోయిన తారక్క

Advertisement
Update:2025-01-01 20:13 IST

మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్‌ సహచరి తారక్క లొంగిపోయారు. బుధవారం మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ ఎదుట ఆమె లొంగిపోయారు. ఆమె మావోయిస్టు పార్టీ స్పెషల్‌ జోనల్‌ కమిటీ సభ్యురాలిగా ఉన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రానికి చెందిన మల్లోజుల కోటేశ్వర్‌ రావు, మల్లోజుల వేణుగోపాల్‌ అన్నదమ్ములు. కోటేశ్వర్‌ రావు అలియాస్‌ కిషన్‌ జీ మావోయిస్టు పార్టీ సెంట్రల్‌ కమిటీ సభ్యుడిగా ఉన్న సమయంలోనే పశ్చిమబెంగాల్‌ లో జరిగిన ఎన్‌కౌంటర్‌ లో మృతిచెందారు. ఆయన సోదరుడు వేణుగోపాల్‌ ప్రస్తుతం సెంట్రల్‌ కమిటీ సభ్యుడిగా పని చేస్తున్నారు. తారక్క అలియాస్‌ విమల 1983లో పీపుల్స్‌ వార్‌ పార్టీలో చేరారు. ఆమెపై నాలుగు రాష్ట్రాల్లో 170కిపైగా కేసులు ఉన్నాయి. ఆమెపై రూ.కోటి రివార్డు ఉంది. ఆమె లొంగుబాటుకు పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.

Tags:    
Advertisement

Similar News