ఢిల్లీకి చేరుకున్న లగచర్ల బాధితులు
రేపు నేషనల్ ఎస్సీ, ఎస్టీ కమిషన్ కు ఫిర్యాదు చేయనున్న బాధితులు
లగచర్ల ఫార్మా పరిశ్రమ బాధిత కుటుంబాలు ఢిల్లీకి చేరుకున్నాయి. సోమవారం నేషనల్ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను కలిసి తమపై రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ పోలీసులు చేసిన దాడులు, దారుణాలపై బాధిత కుటుంబాలు ఫిర్యాదు చేయనున్నాయి. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచన మేరకు మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, బీఆర్‌ఎస్ నాయకులు లగచర్ల బాధితులను తీసుకొని ఢిల్లీకి చేరుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి తన నియోజకవర్గం కొడంగల్‌లో ఫార్మా పరిశ్రమల ఏర్పాటుకు భూసేకరణకు పూనుకున్నారు. ఈక్రమంలో కొందరు రైతులు అధికారులపై తిరుగుబాటు చేశారు. ఈ ఘటనను సాకుగా తీసుకొని పోలీసులు లగచర్లతో పాటు పరిసర గ్రామాల్లో అర్ధరాత్రి పూట దాడులు చేశారు. మహిళలపై అఘాయిత్యాలకు తెగబడ్డారు. తమపై జరిగిన దాడిని ఇదివరకే తెలంగాణ ఎస్సీ, ఎస్టీ కమిషన్ దృష్టికి తీసుకెళ్లిన బాధితులు సోమవారం నేషనల్ ఎస్సీ, ఎస్టీ కమిషన్ కు ఫిర్యాదు చేయనున్నారు.