కేటీఆర్‌ విచారణ ప్రారంభం

మాజీ మంత్రిని ప్రశ్నిస్తున్న ముగ్గురు అధికారులు

Advertisement
Update:2025-01-09 11:06 IST

ఫార్ములా -ఈ రేసు కేసులో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విచారణ ప్రారంభమైంది. ఉదయం 9,30 గంటలకు నందినగర్‌ లోని తన నివాసం నుంచి పార్టీ శ్రేణులతో కలిసి బయల్దేరిన కేటీఆర్‌ 10.10 గంటలకు ఏసీబీ ఆఫీస్‌ కు చేరుకున్నారు. ఏసీబీ హెడ్‌ క్వార్టర్స్‌ లోని ప్రత్యేక గదిలో కేటీఆర్‌ ను విచారిస్తున్నారు. దానికి పక్కనే ఉన్న గదిలోని గ్లాస్‌ డోర్‌ నుంచి విచారణను సీనియర్‌ న్యాయవాది రామచందర్‌ రావు పరిశీలిస్తున్నారు. ఏసీబీ జాయింట్‌ డైరెక్టర్‌ రుతిరాజ్‌, అడిషనల్‌ ఎస్‌పీ శివరాం శర్మ, డీఎస్పీ మాజిద్‌ ఖాన్‌ ఆధ్వర్యంలో కేటీఆర్‌ ను ప్రశ్నిస్తున్నారు. ఇద్దరు సీఐలు విచారణ అధికారులకు సపోర్టింగ్‌ టీమ్‌ గా పని చేస్తున్నట్టు తెలిసింది. సుమారు 25 ప్రశ్నలను ఏసీబీ అధికారులు సిద్ధం చేశారని సమాచారం. ఫిర్యాదు చేసిన ఎంఏయూడీ ప్రిన్సిపల్‌ సెక్రటరీ దానాకిషోర్‌ తో పాటు ఎంఏయూడీ మాజీ స్పెషల్‌ సీఎస్‌ అర్వింద్‌ కుమార్‌ స్టేట్‌ మెంట్ల ఆధారంగా ఈ ప్రశ్నావళిని సిద్ధం చేశారు. గురువారం సాయంత్రం వరకు కేటీఆర్‌ విచారణ కొనసాగే అవకాశం ఉంది.

Tags:    
Advertisement

Similar News