ఏమైనా చెప్పుకోవాలంటే ఏపీ హైకోర్టుకే వెళ్లండి
సజ్జల భార్గవ్ కు తేల్చిచెప్పిన సుప్రీం కోర్టు
వైసీపీ సోషల్ మీడియా ఇన్‌చార్జీ పిటిషన్‌పై విచారణ జరిపేందుకు సుప్రీం కోర్టు ససేమిరా అంది. ఏమైనా చెప్పుకోవాలంటే ఏపీ హైకోర్టుకే వెళ్లాలని తేల్చిచెప్పింది. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని చెప్తూ ఏపీ ప్రభుత్వం తనపై దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్ లను కొట్టేయాలని భార్గవ్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. పిటిషనర్ తరపున సీనియర్ అడ్వొకేట్ కపిల్ సిబల్, ఏపీ ప్రభుత్వం తరపున మరో సినియర్ అడ్వొకేట్ సిద్ధార్థ లూద్రా వాదనలు వినిపించారు. పాత విషయాలకు కొత్త చట్టం ప్రకారం కేసులు పెడుతున్నారని సిబల్ పేర్కొనగా.. చట్టం ఎప్పుడు తెచ్చారనేది కాకుండా మహిళలపై అసభ్య పోస్టులను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని లూద్రా వాదించారు. ఈ వ్యవహారంలో కీలక పాత్రదారి అయిన భార్గవ్ విచారణకు సహకరించడం లేదని తెలిపారు. జస్టిస్ సూర్యకాంత్ స్పందిస్తూ.. దుర్భాషలాడే వ్యక్తులెవరైనా చట్టపరమైన పరిణామాలను ఎదుర్కోవాల్సిందేనని అన్నారు. భార్గవ్ ఏపీ హైకోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేసేందుకు రెండు వారాల సమయం ఇచ్చారు.