భార్యను కాల్‌ గర్ల్‌గా మార్చిన భర్త... చివరికి ఏం జరిగిందంటే..!

భార్యాభర్తలిద్దరికీ కొన్నాళ్లుగా పడటం లేదు. 2019లో వీళ్లకు పెళ్లయింది. అప్పటి నుంచి మహిళను శారీరక, మానసిక, చిత్రహింసలకు గురి చేస్తున్నాడు.

Advertisement
Update:2024-04-12 12:10 IST

ఓ వివాహితకు ఓరోజు అన్‌నోన్ నంబర్‌ నుంచి కాల్ వచ్చింది. ఫోన్ లేపి హలో అనగానే.. అవతలి వ్యక్తి "రేటెంత?" అన్నాడు. అంతే ఆమెకు గుండెలు జారినంత పనైపోయింది. నోటి వెంట మాట రాలేదు. "ఎవరు మీరు, ఏం మాట్లాడుతున్నారు?. నా నంబర్‌ మీకెలా వచ్చింది?. రాంగ్ నంబర్‌. ఇంకోసారి ఫోన్ చేస్తే అస్సలు బాగుండదు. అంటూ ఫోన్ పెట్టేసింది. ఫోన్ కట్ చేసిన కాసేపటికే మరో అన్‌ నంబర్‌ నుంచి కాల్ వచ్చింది. ఇప్పుడు కూడా సేమ్‌ సీన్ రిపీటైంది. అలా వరుస పెట్టి ఫోన్లు వస్తూనే ఉన్నాయి. ఎంతకొస్తావ్, డేకి ఎంతా?, నైట్‌కి ఎంతా? అంటూ వందల్లో ఫోన్లు. అంతటితోటో ఆగలేదు. ఆమె సోదరులకు కూడా ఇలానే ఫోన్లే వెళ్తున్నాయి. ‘అమ్మాయి.. ఉందా, రేటెంతా’ అంటూ ప్రశ్నిస్తున్నారు. దీంతో ఆందోళనకు గురైన ఆ మహిళ పోలీసులను ఆశ్రయించింది.

ఆ ఫోన్ల వ్యవహారంపై పోలీసులు తీగలాగితే దిగ్భ్రాంతికర వాస్తవాలు తెలిశాయి. వివాహితను వేధింపులకు గురిచేస్తోంది భర్తే అని తేలింది. దీంతో షాక్‌కు గురైన బాధితురాలు తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

మ్యాటర్‌లోకి వెళ్తే.. భార్యాభర్తలిద్దరికీ కొన్నాళ్లుగా పడటం లేదు. 2019లో వీళ్లకు పెళ్లయింది. అప్పటి నుంచి మహిళను శారీరక, మానసిక, చిత్రహింసలకు గురి చేస్తున్నాడు. దీంతో వేధింపులు తట్టుకోలేక భర్త నుంచి ఆమె విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకుంది.

న్యాయస్థానంలో పిటిషన్‌ కూడా వేసింది. భార్య మీద కోపంతో భర్త కుట్ర పన్నాడు. ఫేస్‌బుక్‌లో ఆమెతో పాటు ఆమె కుటుంబ సభ్యుల ఫోన్‌నెంబర్లు పెట్టి ఓ పేజ్‌ క్రియేట్ చేశాడు.‘కాల్‌ గర్ల్స్‌ కావాలా?’ అంటూ ప్రకటన సృష్టించి, విదేశాలకు వెళ్లిపోయాడు. దాన్ని చూసిన అనేక మంది వారికి ఫోన్లు చేయడం మొదలుపెట్టారు. బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో విషయం తెలిసింది. నిందితుడి అరెస్టుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు.

Tags:    
Advertisement

Similar News