కొండాపూర్‌లో భారీ అగ్నిప్రమాదం
హైదరాబాద్ శివారు కొండాపూర్‌లో అగ్నిప్రమాదం జరిగింది.
Advertisement
హైదరాబాద్ శివారు కొండాపూర్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ఇవాళ సాయంత్రం రాజరాజేశ్వరి కాలనీలోని గెలాక్సీ అపార్ట్‌మెంట్ భారీగా మంటలు చెలరేగాయి. గ్యాస్ సిలిండర్ పేలడంతోనే ప్రమాదం జరిగినట్లు సమాచారం. ప్రమాద సమయంలో అపార్ట్‌మెంట్‌లో ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేస్తున్నారు. ప్రమాద సమయంలో ఫ్లాట్‌లో ఎవరూ లేకపోవడంతో ముప్పు తప్పిందని భావిస్తున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకుని అగ్ని ప్రమాదానికి సంబంధించిన వివరాలపై ఆరా తీస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Advertisement