మృత్యు కుహరంగా మారిన బంగారు గని
మాలిలో విరిగి పడిన కొండచరియలు.. 42 మంది దుర్మరణం
Advertisement
బంగారు గని అందులో పని చేసే కార్మికుల పాలిట మృత్యు కుహరంగా మారింది. పశ్చిమ ఆఫ్రికా దేశమైన మాలిలో తూర్పు ప్రాంతంలో చైనా దేశంలో బంగారం మైనింగ్ చేస్తుంది. కార్మికులు పని చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా కొండచరియలు విరిగి పడటంతో గోల్డ్ మైన్ లో పనిలో నిమగ్రమైన కార్మికులు సజీవ సమాధి అయ్యారు. ఈ ప్రమాదంలో 42 మంది కార్మికులు దుర్మరణం చెందగా మరికొందరు గాయపడ్డారు. మాలి దేశంలోని బంగారు గనుల్లో తరచు ప్రమాదాలు జరిగి పెద్ద సంఖ్యలో కార్మికులు మృత్యువాత పడుతున్నారు. అయినా అక్కడి ప్రభుత్వం, మైనింగ్ చేస్తున్న కంపెనీలు సరైన రక్షణ చర్యలు చేపట్టడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.
Advertisement