కేటీఆర్‌ క్వాష్‌ పిటిషన్‌ పై రేపు తీర్పు

ఉదయం 10.30 గంటలకు వెలువరించున్న హైకోర్టు

Advertisement
Update:2025-01-06 20:13 IST

ఫార్ములా -ఈ కేసులో తనపై ఏసీబీ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ ను కొట్టేయాలని కోరుతూ బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ దాఖలు చేసన క్వాష్‌ పిటిషన్‌ పై మంగళవారం తీర్పురానుంది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ లక్ష్మణ్ ఉదయం 10.30 గంటలకు తీర్పు వెలువరించనున్నారు. ఈ కేసులో ఎలాంటి అవినీతి జరగలేదని, తనకు ఎలాంటి వ్యక్తిగత ప్రయోజనం చేకూరలేదు కాబట్టి ఏసీబీ దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌ ను కొట్టేయాలని కేటీఆర్‌ హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ వేశారు. ఈ పిటిషన్‌ పై జస్టిస్‌ లక్ష్మణ్‌ ఇరుపక్షాల వాదనలు విని తీర్పును రిజర్వ్‌ చేశారు. తాము తుది తీర్పు వెలువరించే వరకు కేటీఆర్‌ ను అరెస్టు చేయొద్దని ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసులో కేటీఆర్ మంగళవారం విచారణకు రావాలని ఈడీ నోటీసులు ఇచ్చింది. సోమవారమే ఏసీబీ విచారణకు హాజరుకావాల్సి ఉండగా తన లాయర్‌ ను అనుమతించలేదనే కారణంతో కేటీఆర్‌ లిఖితపూర్వకంగా వివరణ ఇచ్చారు. దీంతో ఏసీబీ అధికారులు ఈనెల 9న మళ్లీ విచారణకు రావాలని కేటీఆర్‌ కు సోమవారం సాయంత్రమే నోటీసులు ఇచ్చారు. ఏసీబీ, ఈడీ కేటీఆర్‌ ను విచారించడానికి నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో క్వాష్‌ పిటిషన్‌ పై హైకోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వబోతుందా అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.




 


హైకోర్టు తీర్పు వచ్చే వరకు సమయమివ్వండి.. ఈడీని కోరిన కేటీఆర్‌

ఫార్ములా -ఈ కేసులో విదేశీ సంస్థకు నగదు బదిలీ వ్యవహారంలో మంగళవారం విచారణకు హాజరు కావాలని ఈడీ ఇచ్చిన నోటీసులపై కేటీఆర్‌ స్పందించారు. ఏసీబీ తనపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ ను కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌ పై తీర్పు రావాల్సి ఉందని ఈడీకి సమాచారం ఇచ్చారు. హైకోర్టు తీర్పును రిజర్వ్‌ చేసినందున ఆ తీర్పు వచ్చే వరకు తనకు సమయం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కోర్టు తీర్పును తాను గౌరవిస్తానని ఈడీకి ఇచ్చిన సమాధానంలో స్పష్టం చేశారు.

Tags:    
Advertisement

Similar News