హైదరాబాద్‌లో భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు
హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 1,184 కేసులు నమోదు
Advertisement
కొత్త సంవత్సర వేడుకల నేపథ్యంలో మంగళవారం భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 1,184 కేసులు నమోదయ్యాయి. రాచకొండ కమిషనరేట్ పరిధిలో 619 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు తగిన చర్యలు చేపట్టారు. ఆకతాయిలు, మందుబాటులపై పోలీసులు దృష్టి సారించారు.
Advertisement