నేడు ఈడీ విచారణకు కేటీఆర్
ఈ కేసులో దర్యాప్తులో భాగంగా ఇప్పటికే అర్వింద్‌కుమార్, హెచ్‌ఎండీఏ బీఎల్‌ఎన్‌రెడ్డిలను విచారించిన ఈడీ
ఫార్ములా-ఈ రేస్ కేసులో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుట హాజరుకానున్నారు. వాస్తవానికి ఈ నెల 7న ఆయన హాజరుకావాల్సి ఉన్నా తాను రాలేనని కేటీఆర్ చెప్పడంతో 16న విచారణకు హాజరు కావాలని ఈడీ అధికారులు మరోసారి నోటీసులిచ్చారు. ఫార్ములా-ఈ రేస్‌లో నిబంధనల ఉల్లంఘనపై ఏసీబీ దర్యాప్తు చేస్తుండగా.. ఇందులో ఆర్బీఐ అనుమతి లేకుండా విదేశీ సంస్థకు నిధుల చెల్లింపుపై ఈడీ మరో కేసు నమోదు చేసింది. దర్యాప్తులో భాగంగా ఇప్పటికే ఈ కేసులో మున్సిపల్ ప్రత్యేక కార్యదర్శి అర్వింద్‌కుమార్, హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్‌ఎన్‌రెడ్డిలను ఈడీ విచారించింది. మరోవైపు ఏసీబీ తనపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించిన విషయం విదితమే. దీన్ని సవాల్ చేస్తూ కేటీఆర్ వేసిన పిటిషన్‌పై విచారించిన సుప్రీంకోర్టు ఈ దశలో హైకోర్టు ఆదేశాలపై జోక్యం చేసుకోలేమని చెప్పింది. దీంతో పిటిసన్‌ను ఉపసంహరించుకుంటామని కేటీఆర్ తరఫు లాయర్ కోర్టుకు చెప్పడంతో అందుకు అంగీకరించింది. ఈ నేపథ్యంలోనే నేడు ఈడీ విచారణకు కేటీఆర్ హాజరుకానున్నారు.