ఫార్ములా -ఈ కేసు.. ముగిసిన ఈడీ విచారణ

ఐదున్నర గంటల పాటు కేటీఆర్‌ ను ప్రశ్నించిన ఈడీ

Advertisement
Update:2025-01-16 18:22 IST

ఫార్ములా - ఈ రేస్‌ కేసులో మాజీ మంత్రి కేటీఆర్‌ ను ఈడీ అధికారులు ప్రశ్నించారు. గురువారం ఉదయం 11 గంటలకు ఈడీ కార్యాలయానికి చేరుకోగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులతో కూడిన బృందం ఫార్ములా - ఈ రేస్‌ కేసులో హెచ్‌ఎండీఏ నుంచి ఎఫ్‌ఈవోకు నగదు బదిలీకి సంబంధించిన ప్రొసీడింగ్స్‌ పై ప్రశ్నించింది. సాయంత్రం 5.30 గంటల సమయంలో ఆయన విచారణ ముగిసింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఐదున్నర గంటల పాటు కేటీఆర్‌ ను ఈడీ ప్రశ్నించింది. ఆర్‌బీఐ అనుమతి తీసుకొనే నగదు బదిలీ చేశారా? నిబంధనల మేరకు నగదు బదిలీ చేశారా? బిజినెస్‌ రూల్స్‌ ఫాలో అయ్యారా లాంటి పలు ప్రశ్నలను ఈడీ అధికారులు కేటీఆర్‌ ను అడిగినట్టు తెలిసింది. కేటీఆర్‌ కు వేసిన ప్రశ్నలు, ఆయన చెప్పిన సమాధానాలను స్టేట్‌మెంట్‌ రూపంలో రికార్డు చేసి ఆయన సంతకం తీసుకొని ఈడీ అధికారులు కాసేపట్లోనే కేటీఆర్‌ ను బయటకు పంపనున్నారు.

Tags:    
Advertisement

Similar News