మాజీ మంత్రి హరీశ్‌రావుపై కేసు నమోదు

చక్రధర్‌గౌడ్‌ ఫిర్యాదు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన బాచుపల్లి పోలీసులు;

Advertisement
Update:2025-02-28 13:28 IST

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావుపై కేసు నమోదైంది. చక్రధర్‌గౌడ్‌ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు నగరంలోని బాచుపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. మాజీమంత్రితో పాటు మరో ముగ్గురి నుంచి ప్రాణహాని ఉందని చక్రధర్‌గౌడ్‌ ఫిర్యాదు చేశారు. దీంతో హరీశ్‌రావు, సంతోష్‌కుమార్‌, రాములు, వంశీపై కేసు నమోదైంది. హరీశ్‌పై 351(2), ఆర్‌డబ్ల్యూ 3(5) సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఎఫ్‌ఐఆర్‌లో రెండో నిందితుడిగా హరీశ్‌రావు పేరును పోలీసులు చేర్చారు. 

Tags:    
Advertisement

Similar News