పోసానికి 14 రోజుల రిమాండ్
మార్చి 12 వరకు పోసాని రిమాండ్‌లో ఉండనున్నారు.;
Advertisement
కులాలు, సినీ అభిమానులు, రాజకీయపార్టీల మధ్య విద్వేషాలు, వైషమ్యాలు రెచ్చగొట్టేలా వ్యవహరించారంటూ నమోదైన కేసులో, సినీ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ మేరకు రైల్వే కోడూరు మెజిస్ట్రేట్ నిర్ణయం తీసుకున్నది. మార్చి 12 వరకు పోసాని రిమాండ్‌లో ఉండనున్నారు. పోసానిని రాజంపేట సబ్ జైలుకు తరలించారు.
ఓబులావారిపల్లి మండలం కొర్లకుంటకు చెందిన జనసేన నాయకుడు జోగినేని మణి ఈ నెల 24న పోసానిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోసానిపై 196, 353 (2), 11 రెడ్ విత్ 3 (5) సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 26న పోసానిని హైదరాబాద్‌లో ఆయన నివాసంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఓబులవారి పల్లె పీఎస్‌కు తరలించారు.
Advertisement