నాంపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో అగ్ని ప్రమాదం
నాంపల్లి ఏక్‌మినార్ కూడలిలో ఉన్న పెట్రోల్ బంక్ వద్ద అగ్ని ప్రమాదం సంభవించింది.
Advertisement
నాంపల్లి రైల్వేస్టేషన్ పెను ప్రమాదం తప్పింది. స్టేషన్ పక్కనే ఉన్న పెట్రోల్ బంక్‌లో అగ్నిప్రమాదం జరిగింది. బంక్‌లో ఆయిల్ నింపేందుకు హిందూస్థాన్ పెట్రోలియం ట్యాంకర్ వచ్చింది. ఈ క్రమంలో ట్యాంకర్ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీన్ని గమనించిన స్థానికులు, పెట్రోల్ ట్యాంకర్ డ్రైవర్ అక్కడి నుంచి భయంతో పరుగులు తీశారు. ఫైర్ ఇంజిన్ వచ్చి మంటలను అదుపు చేసింది. బంక్ పక్కనే నాంపల్లి రైల్వేస్టేషన్ ఉండటంతో స్థానికులు కంగారు పడ్డారు. నాలుగు అగ్నిమాపక శకటాలతో చేరుకున్న సిబ్బంది మంటలను ఆర్పివేశారు. పెట్రోల్ బంక్‌కు మంటలు వ్యాపించి ఉంటే పెద్ద ప్రమాదం సంభవించేదని హైదరాబాద్ జిల్లా అగ్నిమాపక అధికారి వెంకన్న తెలిపారు.
Advertisement