మాదాపూర్‌ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో అగ్ని ప్రమాదం

మాదాపూర్‌ అయ్యప్ప సొసైటీలోని ఓ వాణిజ్య సముదాయంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.

Advertisement
Update:2025-01-01 18:10 IST

హైదరాబాద్‌లోని మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో ఓ కమర్షియల్ కాంప్లెక్స్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. భవనం ఐదో అంతస్తులోని నిపున్‌ ఐటీ సొల్యూషన్స్‌ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో మంటలు చెలరేగాయి. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని రెండు ఫైరింజన్లతో మంటలు ఆర్పివేశారు. అగ్ని ప్రమాదంలో కార్యాలయంలోని సామగ్రి, ఎలక్ట్రానిక్‌ పరికరాలు కాలిబూడిదయ్యాయి. వాణిజ్య సముదాయంలో మంటలు చెలరేగడంతో మిగిలిన కార్యాలయాల్లోని సిబ్బంది ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు.

Tags:    
Advertisement

Similar News