కోదాడ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం
ఇద్దరు మృతి.. ఆరుగురికి తీవ్రగాయాలు
Advertisement
ఖమ్మం జిల్లా ముదిగొండ సమీపంలోని కోదాడ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో వీరన్న, హుస్సేన్ అనే ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. గ్రానైట్ స్లాబుల లోడుతో నేలకొండపల్లి మండలం ఖానాపురం వరకు వెళ్తుండగా డీసీఎం వీల్ బోల్టు విరగడంతో ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో డీసీఎంలో డ్రైవర్‌తో పాటు తొమ్మిది మంది గ్రానైట్ కార్మికులు ఉన్నారు. క్షతగాత్రులను ఖమ్మం ఆస్పత్రికి తరలించారు.
Advertisement