దేవరకొండ పెద్ద దర్గా వద్ద ఘోర ప్రమాదం
ముగ్గురు మృతి..మరొకరికి తీవ్ర గాయాలు
నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణ శివారు పెద్ద దర్గా వద్ద ఘోర ప్రమాదం జరిగింది. స్వీట్స్ దుకాణంలోకి డీసీఎం దూసుకెళ్లిన ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. దేవరకొండ పెద్ద దర్గా వద్ద రెండురోజులుగాఉర్సు ఉత్సవాలు జరుగుతున్నాయి.ఈ ఉత్సవాలలో స్వీట్స్ దుకాణం పెట్టుకుని జీవనం సాగిస్తున్న చిరు వ్యాపారితో పాటు దర్శనానికి వచ్చిన మరో ఇద్దరిని అనుకోరి రూపంలో వచ్చిన మృత్యువు కబళించింది. అతి వేగం డీసీఎం దూసుకురావడంతో దుకాణం ముందున్న ముగ్గురిపై బండరాళ్లు పడి అక్కడిక్కడే చనిపోయారు. మృతులను అబ్ధుల్ ఖాదర్, హాజీ, నబీనగా గుర్తించారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్ఠలానికి చేరుకున్న పోలీసులు శిథిలాల కింద చిక్కుకున్నమృతదేహాలను బైటికి తీశారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పొట్టగూటి కోసం వచ్చిన కానరాని లోకాలకు వెళ్లాలరంటూ వారి కుటుంబసభ్యులు, బంధువులు రోదించిన తీరు అందరినీ కలిచివేసింది.