భార్య వేధింపులతో ప్రముఖ సింగర్ ఆత్శహత్య

ఒడిశాకు చెందిన ప్రముఖ సింగర్, ర్యాపర్ అభినవ్ సింగ్ బెంగళూరులో విషం తాగి సుసైడ్ చేసుకున్నాడు

Advertisement
Update:2025-02-13 17:35 IST

ఇటీవల కాలంలో భార్యల వేధింపులతో బలవన్మరణానికి పాల్పడుతున్న ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా ఒడిశాకు చెందిన ప్రముఖ సింగర్, ర్యాపర్ అభినవ్ సింగ్ బెంగళూరులో విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు. భార్య ఆమె ఫ్యామిలీ చేసిన మెంటల్ టార్చర్ వల్లే తన కుమారుడు చనిపోయాడంటూ తండ్రి బిజయ్ మారతహళ్లి పోలీసు స్టేషన్‌లో కంప్లైంట్ చేశారు.ఈ ఘటన పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే.. అభినవ్ భార్య వేధింపుల వల్లే ప్రాణాలు తీసుకున్నాడా? వేరే ఇతర కారణాలేమైనా ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అభినవ్ ఒడియా ర్యాప్ సాంగ్స్ తో ఫేమస్ అయ్యాడు. కథక్ ఆంథెమ్ సాంగ్‌తో మరింత పాపులర్ అయ్యాడు.

ఇతడు అర్భన్ లోఫర్ అనే మొదటి హిప్ హాప్ లేబుల్‌ను స్థాపించాడు.సతీమణులు మానసికంగా చిత్రహింసలు పెడుతుంటే బయటకు చెప్పుకోలేని పరిస్థితి. చెప్పినా ఎవరూ పట్టించుకోని దుస్థితి. ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో, నరక కుంపటి నుంచి బయటపడే ఆలోచనలో ఆత్మాహుతి చేసుకుంటున్న భార్యాబాధితులెందరో! ఈ మధ్య అతుల్‌ సుభాష్‌ అనే భార్యాబాధితుడి బలవన్మరణం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆ తర్వాత కర్ణాకటలో కానిస్టేబుల్‌ తిప్పన్న, రాజస్తాన్‌లో డాక్టర్‌ అజయ్‌కుమార్‌, ఢిల్లీలో పునీత్‌ ఖురానా.. ఇలా రోజుకో ఉదంతం బయటకు వచ్చింది. తాజాగా ఈఘటన వెలుగులోకి వచ్చింది.

Tags:    
Advertisement

Similar News