కుంభమేళా నుంచి తిరిగివస్తూ.. ఏడుగురు హైదరాబాద్ వాసుల మృతి

జబల్‌పూర్‌ జిల్లా పరిధిలోని సిహోరా ప్రాంతంలో మినీ బస్‌, ట్రక్కు ఢీకొన్న ఘటనలో ఏడుగురు అక్కడిక్కడే మృతి

Advertisement
Update:2025-02-11 12:03 IST

కుంభమేళా నుంచి తిరిగి వస్తుండగా మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన యాత్రికులు మృతి చెందారు. మంగళవారం ఉదయం 8.30 గంటల సమయంలో జబల్‌పూర్‌ జిల్లా పరిధిలోని సిహోరా ప్రాంతంలో మినీ బస్‌, ట్రక్కు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు యాత్రికులు అక్కడికక్కడే మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. హైవే పైకి ట్రక్కు రాంగ్‌ రూట్‌లో రావడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకున్నదని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఘటనా స్థలంలోనే ఏడుగురు ప్రాణాలు కోల్పోగా.. మరికొందరు బస్సులో చిక్కుకున్నారు. సమాచారం అందుకుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. బస్సులో ఇరుక్కున్న క్షతగాత్రులను సిహోరాలోని ఆస్పత్రికి తరలించారు. మృతులంతా హైదరాబాద్ వాసులని అధికారులు వెల్లడించారు. అయితే  ఏ ఏరియా వారు అనేది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు.

ప్రమాదానికి గురైన వాహనం నంబర్‌ AP 29 W 1525 గా గుర్తించారు. మినీ బస్సు రిజిస్ట్రేషన్‌ ఆధారంగా ప్రమాదానికి గురైన వారు ఏపీ వాసులు అయి ఉంటారని మొదట భావించారు. తర్వాత మృతదేహాల వద్ద దొరికిన ఆధారాలతో మృతులను నాచారం వాసులుగా గుర్తించినట్లు వెల్లడించారు. మృతుల పేర్లు, ఇతర వివరాలు ఇంకా తెలియరాలేదు. 

Tags:    
Advertisement

Similar News