భార్యతో గొడవపడి భర్త ఆత్మహత్యాయత్నం

ఓ బట్టల దుకాణంలో శ్రావణ్‌ అనే వ్యక్తి వినియోదారుల ముందే పెట్రోల్‌ పోసుకొని నిప్పంటించుకున్నాడు

Advertisement
Update:2025-02-09 23:55 IST

భార్యతో గొడవపడి భర్త ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన సికింద్రాబాద్‌లో చోటుచేసుకున్నది. ఓ బట్టల దుకాణంలో శ్రావణ్‌ అనే వ్యక్తి వినియోదారుల ముందే పెట్రోల్‌ పోసుకొని నిప్పంటించుకున్నాడు. అతని భార్య అదే బట్టల దుకాణంలో పనిచేస్తున్నది. అక్కడి వచ్చిన శ్రావణ్‌ ఆమెతో గొడవ పడ్డాడు. కోపంతో వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను మీద పోసుకొని నిప్పు పెట్టుకున్నాడు. ఈ ఘటనతో భయభ్రాంతులకు గురైన దుకాణంలోని వినియోగదారులు బైటికి పరుగులు పెట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని గాయపడ్డ శ్రావణ్‌ను గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. 

Tags:    
Advertisement

Similar News