వల్లభనేని వంశీ అరెస్ట్‌

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో అరెస్టు సమాచారం.

Advertisement
Update:2025-02-13 08:29 IST

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్‌ రాయదుర్గంలోని మైహోం భుజాలో ఏపీ పోలీసులు ఆయనను అరెస్టు చేసి విజయవాడ తరలిస్తున్నారు. కిడ్నాప్‌, దాడి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బీఎన్‌ఎస్‌ సెక్షన్లు 140(1), 308, 351 (3), రెడ్‌ విత్‌ 3(5) కింద వంశీపై కేసు నమోదు చేశారు. వైసీపీ అధికారంలో ఉండగా గన్నవరం టీడీపీ ఆఫీసుపై జరిగిన దాడి కేసులో వంశీ ఏ71గా ఉన్నారు. ఈ నేపథ్యంలో అతడిని ఏపీ పోలీసులు అరెస్టు చేశారు

Tags:    
Advertisement

Similar News