మీర్‌పేటలో మహిళ హత్యకేసులో వెలుగులోకి కీలక విషయాలు
విచారణలో గురుమూర్తి నుంచి పోలీసులు పలు కీలక విషయాలను పోలీసులు రాబట్టినట్లు సమాచారం
Advertisement
నగరంలో మీర్‌పేటలో భార్యను హతమార్చి మృతదేహాన్ని ముక్కలుగా చేసి మాయం చేసిన కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతున్నది. కోర్టు అనుమతితో నాలుగు రోజుల పాటు నిందితుడిని కస్టడీకి తీసుకున్న పోలీసులు.. మూడోరోజు విచారిస్తున్నారు. విచారణలో పలు కీలక విషయాలను పోలీసులు రాబట్టినట్లు సమాచారం. భార్య మాధవిని గురుమూర్తి ఒక్కడే హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో నిందితులు గురుమూర్తితో పాటు మరో ముగ్గురి పేర్లనూ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. గురుమూర్తి సోదరి సుజాత (45), తల్లి సుబ్బలక్ష్మమ్మ, సోదరుడు కిరణ్‌లను నిందితులుగా చూపారు. ప్రధాన నిందితుడిపై హత్యకు సంబంధించి పలు సెక్షన్లు నమోదు చేయగా.. మిగిలిన ముగ్గురిపై బీఎన్‌ఎస్‌లోని 85 సెక్షన్ (గృహహింస) ప్రయోగించారు. ఈ ముగ్గురు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
Advertisement