ఛత్తీస్‌గఢ్‌లో ఎన్ కౌంటర్...నలుగురు మావోయిస్టులు మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని దట్టమైన అడవుల్లో మరోసారి తుపాకులు గర్జించాయి. ఈ ఎన్ కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు.
ఛత్తీస్‌గఢ్ దట్టమైన అడవుల్లో మరోసారి భారీ ఎన్ కౌంటర్ జరిగింది. బీజాపూర్ జిల్లాలోని ఊసూరు పోలీసు స్టేషన్ పరిధిలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య భీకరమైన ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. పామేడు – మద్దేడు అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. మావోయిస్టుల మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
ఈ ఎదురుకాల్పుల్లో భద్రతా బలగాలకు ఎలాంటి గాయాలు కాలేదని సమాచారం. ఈ ఎదురుకాల్పులకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. అటవీ ప్రాంతం వద్ద భద్రతా దళాలకు, నక్సల్స్ కు మధ్య కాల్పులు జరిగాయి. యాంటీ నక్సల్ ఆపరేషన్ చేపడుతున్న సంయుక్త భద్రతా దళాలకు మావోయిస్టులు తారసపడ్డారు. ఈ ఉదయం 9 గంటల నుంచి కాల్పులు జరుగుతున్నాయి. ఘటన స్థలం నుంచి పోలీసులు పలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.