టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుపై సైబర్ క్రైమ్ కేసు
టీవీ 5 యాంకర్, ఎండీపైనా క్రిమినల్ కేసు నమోదు
టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుపై సైబర్ క్రైమ్ కేసు నమోదు అయింది. ఆయన చైర్మన్ గా ఉన్న టీవీ 5 చానల్ న్యాయవ్యవస్థను కించ పరిచేలా వ్యాఖ్యలు చేసిందని, కాపీ రైట్ చట్టాన్ని ఉల్లంఘించిందనే ఆరోపణలపై ఈ కేసు దాఖలు చేశారు. టీవీ 5 యాంకర్ సింధూర శివ, చైర్మన్ బీఆర్ నాయుడు, ఎంబీ బొల్లినేని రవీంద్రనాథ్ పై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే ఈనెల 17న యాంకర్ సింధూర శివ న్యాయవ్యవస్థపై, న్యాయమూర్తి, న్యాయవాదులపై తీవ్రస్థాయిలో అనుచిత వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ న్యాయవ్యవస్థను, న్యాయవ్యవస్థ అస్తిత్వాన్ని కించపరిచేలా కామెంట్స్ చేశారు. కోర్టు వెబ్‌సైట్‌లోకి చొరబడి న్యాయ ప్రక్రియ, వాదనలు సహా కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించి ఆ కంటెంట్‌ను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశారు. ప్రముఖ న్యాయవాది ఇమ్మనేని రామారావు ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు సింధూర శివ, బీఆర్ నాయుడు, రవీంద్రనాథ్ పై కేసు నమోదు చేశారు.