అమ్మాయిలూ జ‌ర‌భ‌ద్రం..!

మ్యాట్రిమోనీ సైట్ ద్వారా ప‌రిచ‌యం చేసుకోవ‌డం.. ఆపై పెళ్లి చేసుకుంటాన‌ని న‌మ్మించ‌డం.. ర‌క‌ర‌కాల రూపాల్లో వారినుంచి డ‌బ్బు వ‌సూలు చేసి ఆపై మోసం చేయ‌డం.. ఇదీ ఈ నేర‌గాడి క్రైమ్ ట్రాక్‌..

Advertisement
Update:2022-09-14 16:13 IST

అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజ‌నీర్‌గా జాబ్‌.. ల‌క్ష‌ల్లో వేత‌నం.. ఫొటోలో కుర్రాడు అందంగానే ఉన్నాడు.. మ్యాట్రిమోనీ సైట్లో ఈ వివ‌రాలు చూస్తే.. అమ్మాయిల‌కు పెళ్లి సంబంధాలు చూసే కుటుంబాలు స‌హ‌జంగానే అటువైపు మొగ్గు చూపుతాయి... స‌రిగ్గా ఇదే ఆలోచ‌న‌తో మోసాల‌కు తెగ‌బ‌డుతున్నాడు ఓ సైబ‌ర్ నేర‌గాడు.

మ్యాట్రిమోనీ సైట్ ద్వారా ప‌రిచ‌యం చేసుకోవ‌డం.. ఆపై పెళ్లి చేసుకుంటాన‌ని న‌మ్మించ‌డం.. ర‌క‌ర‌కాల రూపాల్లో వారినుంచి డ‌బ్బు వ‌సూలు చేసి ఆపై మోసం చేయ‌డం.. ఇదీ ఈ నేర‌గాడి క్రైమ్ ట్రాక్‌..

ఇంత‌కీ ఇత‌ను మ్యాట్రిమోనీలో ప‌రిచ‌యం చేసిన ఫొటో అత‌నిది కాదు.. వేరొక‌రి ఫొటోను త‌న‌దిగా పేర్కొంటూ ప‌రిచ‌యం చేసుకుంటున్నాడు. కొచ్చెర్ల శ్రీ‌కాంత్ (35) అనే పేరుతో త‌న‌ను ప‌రిచ‌యం చేసుకుంటున్న అతను ఇటీవ‌ల ఓ యువ‌తి వ‌ద్ద రూ.48 ల‌క్ష‌ల న‌గ‌దు కాజేశాడు. అనంత‌రం అనుమానం వ‌చ్చిన యువ‌తి పోలీసుల‌ను ఆశ్ర‌యించ‌డంతో అత‌ని బాగోతం బ‌య‌ట‌ప‌డింది.

ఇత‌ని పేరు కొచ్చెర్ల శ్రీ‌కాంత్ కాద‌ని.. అస‌లు పేరు పొట్లూరి వంశీకృష్ణ అని పోలీసులు తేల్చారు. అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజ‌నీర్ ని అంటూ చెప్పిన‌దంతూ అబ‌ద్ధ‌మ‌ని పోలీసుల విచార‌ణ‌లో వెల్ల‌డైంది. ఇత‌ని స్వ‌స్థ‌లం విజ‌య‌వాడ‌గా గుర్తించారు. నిందితుడి నుంచి రూ.38 ల‌క్ష‌లు రిక‌వ‌రీ చేశారు. గ‌తంలోనూ ఇత‌నిపై 8 కేసులున్నాయ‌ని పోలీసులు చెబుతున్నారు. ఇప్ప‌టికే ప‌లువురు యువ‌తుల‌ను ఇత‌ను మోస‌గించాడ‌ని పోలీసులు తెలిపారు. ఇలాంటి వ్య‌క్తుల విష‌యంలో అమ్మాయిలు, వారి త‌ల్లిదండ్రులు చాలా అప్ర‌మ‌త్తంగా వ్య‌వ‌హ‌రించాల‌ని వారు సూచిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News