'పుష్ప 2' పైరసీ చూస్తుంటే కంప్లైంట్ చేయండి
అభిమానులు, ఆడియన్స్‌కు మూవీ టీమ్ రిక్వెస్ట్
Advertisement
ప్రపంచ వ్యాప్తంగా వేలాది స్క్రీన్స్‌లో రిలీజ్ అయిన పుష్ప 2 సినిమాకు పైరసి బెంగ పట్టుకుంది. కొందరు కేటుగాళ్లు పైరసీ వీడియోలను వివిధ ప్లాట్ ఫామ్‌లలో అందుబాటులోకి తెచ్చారు. దీంతో మూవీ టీమ్ అలర్ట్ అయ్యింది. పుష్ప 2 మూవీని ఎవరైనా పైరసీ వీడియోల రూపంలో చూస్తుంటే తమకు కంప్లైంట్ చేయాలని రిక్వెస్ట్ చేసింది. హీరో అల్లు అర్జున్ అభిమానులతో పాటు సాధారణ ఆడియన్స్ తమకు సహకరించాలని విజ్ఞప్తి చేసింది. వాట్సప్ నంబర్ 89786 50014కు వివరాలు పంపాలని విజ్ఞప్తి చేసింది.
Advertisement