ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కు సిటీ సివిల్‌ కోర్టు సమన్లు

తిరుమల లడ్డూ వివాదంలో అనుచిత వ్యాఖ్యలు చేశారని పిటిషన్‌

Advertisement
Update:2024-10-21 16:47 IST

ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ కు హైదరాబాద్‌ సిటీ సివిల్‌ కోర్టు సమన్లు జారీ చేసింది. తిరుమల లడ్డూ వివాదంలో పవన్‌ అనుచిత వ్యాఖ్యలు చేసి హిందువుల మనోభావాలు దెబ్బతీశారని అడ్వొకేట్‌ రామారావు సిటీ సివిల్ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. సెక్షన్‌ 91 ప్రకారం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం సందర్భంగా తిరుమల నుంచి అయోధ్యకు పంపిన లడ్డూల తయారీకి కల్తీ నెయ్యి ఉపయోగించినట్టు పవన్‌ కామెంట్స్‌ చేశారు. ఆ కొవ్వులో జంతువుల కొవ్వు కలిసిందని ఆరోపించి హిందువుల మనోభావాలు దెబ్బతీశారని పేర్కొన్నారు. ఈ పిల్‌ పై విచారణ జరిపిన సిటీ సివిల్‌ కోర్టు నవంబర్‌ 22న పవన్‌ కళ్యాణ్‌ కోర్టుకు హాజరుకావాలని ఆదేశిస్తూ సమన్లు జారీ చేసింది. పవన్‌ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలు అన్ని సోషల్‌ మీడియా ప్లాట్‌ ఫామ్‌ ల నుంచి తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్‌ కోర్టును అభ్యర్థించారు. ఈమేరకు ఆయా శాఖల సెక్రటరీలకు నోటీసులు ఇవ్వాలని కోరారు. ఈ కేసు తదుపరి విచారణను న్యాయమూర్తి నవంబర్‌ 22వ తేదీకి వాయిదా వేశారు.

Tags:    
Advertisement

Similar News