క్యాబ్‌ డ్రైవర్ దాడి.. మాజీ ఎమ్మెల్యే మృతి

క్యాబ్‌ డ్రైవర్‌, మాజీ ఎమ్మెల్యే మామ్లేదార్ మధ్య జరిగిన ఘర్షణలో మాజీ ఎమ్మెల్యే కుప్పకూలి మరణించారు.

Advertisement
Update:2025-02-15 18:54 IST

క్యాబ్‌ డ్రైవర్, గోవా మాజీ ఎమ్మెల్యే లావూ నేత మామ్లేదార్ మధ్య జరిగిన ఘర్షణలో మాజీ ఎమ్మెల్యే కుప్పకూలి మరణించారు. కర్ణాటకలోని బెళగావిలో ఈ సంఘటన జరిగింది. మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీకి చెందిన గోవా మాజీ ఎమ్మెల్యే లావూ మామ్లేదార్ కారులో ప్రయాణించారు. ఒక లాడ్జీ సమీపంలో క్యాబ్‌ను ఆయన కారు ఢీకొట్టింది. కాగా, ఈ సంఘటన నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే మామ్లేదార్, క్యాబ్‌ డ్రైవర్‌ మధ్య తీవ్ర కొట్లాట జరిగింది. ఇది ముదిరి ఘర్షణకు దారి తీసింది. దీంతో క్యాబ్‌ డ్రైవర్‌ చెంపపై మామ్లేదార్ కొట్టారు. ఈ నేపథ్యంలో ఆ డ్రైవర్‌ మరింత రెచ్చిపోయాడు.

మాజీ ఎమ్మెల్యే చెంపపై పలుమార్లు కొట్టాడు. ఇంతలో అక్కడున్న పబ్లిక్ జోక్యం చేసుకున్నారు. వారిద్దరిని విడిపించారు. మరోవైపు క్యాబ్‌ డ్రైవర్‌తో ఘర్షణ తర్వాత మాజీ ఎమ్మెల్యే మామ్లేదార్ అక్కడ ఉన్న లాడ్జీలోకి వెళ్లారు. మెట్లు ఎక్కి లోపలకు వెళ్లిన వెంటనే కుప్పకూలి పడిపోయారు. ఆయనను హాస్పిటల్‌కు తరలించగా అప్పటికే మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు క్యాబ్‌ డ్రైవర్‌ను అరెస్ట్‌ చేశారు. కాగా, ఆ లాడ్జ్‌లోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.

Tags:    
Advertisement

Similar News