ఆస్తికోసం తాతని హత్యచేసిన మనుమడు

ఆస్తి గొడవలతో తాతని హత్య చేశాడో మనుమడు. ఇందుకు తన స్నేహితుని సహాయం తీసుకున్నాడు. బెంగళూరులో జరిగిందీ ఘటన. హతుడు 70 సంవత్సరాల వృద్ధుడు.

Advertisement
Update:2022-08-22 12:16 IST

ఆస్తి గొడవలతో తాతని హత్య చేశాడో మనుమడు. ఇందుకు తన స్నేహితుని సహాయం తీసుకున్నాడు. బెంగళూరులో జరిగిందీ ఘటన. హతుడు 70 సంవత్సరాల వృద్ధుడు. పేరు పుట్టయ్య. లేబరేటరీ అసిస్టెంటుగా పనిచేసి రిటైరైన పుట్టయ్య యెలహంక లో ఒంటరిగా నివసిస్తున్నాడు. ఆయన భార్య 2017లో మరణించింది.

మైసూరు నివాసి అయిన జయంత్ పుట్టయ్య మనుమడు. అతను తన స్నేహితుడు యాసిన్ అహ్మద్ (22)తో కలిసి పుట్టయ్యను హత్య చేశాడు. జయంత్ తండ్రి చంద్రు పుట్టయ్యకు రెండవ కుమారుడు.

జయంత్, యాసిన్ పుట్టయ్యని హత్యచేసి పారిపోయిన తరువాత హతుని మరొక కుమారుడైన నవీన్ తండ్రికి ఫోన్ చేశాడు. తండ్రి ఫోన్ లిఫ్ట్ చేయకపోవటంతో ఇంటికి వెళ్లి చూడగా పుట్టయ్య విగతజీవిగా కనిపించాడు. తండ్రి మంచంపైనుండి పడిపోయి చనిపోయి ఉంటాడని నవీన్ మొదట భావించాడు. అయితే తండ్రి ముఖం వాచిపోయి, రక్తంతో తడిచిపోయి ఉండటంతో అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన తండ్రి చేతికున్న ఉంగరం కూడా లేదని నవీన్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.

పోలీసులు జయంత్ ని అనుమానించి విచారించగా అతనే హత్య చేసినట్టుగా తేలింది. తన తాత... ఆస్తిని వారసులకు ఇవ్వకపోవటం, తను బ్యాంకు రుణం పొందేందుకు తాత సహకరించకపోవటంతో జయంత్ ఆయన పట్ల కోపం పెంచుకున్నాడు. గతంలోకూడా జయంత్ ఆస్తి విషయంలో తాతతో గొడవపడ్డాడు. ఇవన్నీ కాకుండా హత్య జరిగిన సమయంలో జయంత్ మొబైల్ ఫోన్ అదే ప్రాంతంలో ఉన్నట్టుగా కూడా తేలటంలో పోలీసులు అతడిని అనుమానించారు. జయంత్ ని, యాసిన్ ని మైసూరులో అరెస్టు చేశారు. పుట్టయ్యకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. అందరూ అతనికి దూరంగా వేరేగా ఉంటున్నారు.

Tags:    
Advertisement

Similar News