ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డికి బెయిల్‌ మంజూరు

ఆయనపై నమోదైన మూడు కేసుల్లోనూ షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన జడ్జి

Advertisement
Update:2025-01-14 10:50 IST

హుజురాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డికి ఊరట లభించింది. ఆయనకు బెయిల్‌ మంజూరైంది. ఆదివారం కరీంనగర్‌ కలెక్టరేట్‌లో మంత్రులు నిర్వహించిన సమీక్ష సందర్భంగా కౌశిక్‌ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుని సమావేశం రసాభాసగా మారింది. ఈ పరిణామాలపై ఫిర్యాదులు అందడంతో కౌశిక్‌రెడ్డిపై కరీంనగర్‌ ఒకటో పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో మూడు కేసులు నమోదయ్యాయి. కరీంనగర్‌ పోలీసులు సోమవారం సాయంత్రం హైదరాబాద్‌కు వచ్చిన కౌశిక్‌రెడ్డిని అరెస్ట్‌ చేసి తీసుకెళ్లారు. కరీంనగర్‌ రెండో అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి ప్రేమలత ముందు మంగళవారం ఉదయం హాజరుపరచగా.. 3 కేసులోల షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేశారు. గురువారం లోగా రూ. 2 లక్షలు పూచీకత్తు సమర్పించాలని ఆదేశాలిచ్చారు. పోలీసులు పిలిచిన సమయంలో విచారణకు హాజరు కావాలని చెప్పారు. మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయనని కోర్టుకు కౌశిక్‌రెడ్డి చెప్పారు. అంతకుముందు కరీంనగర్‌ మూడో పట్టన పోలీస్‌ స్టేషన్‌ నుంచి జడ్జి వద్దకు తరలించే క్రమంలో మీడియాతో కౌశిక్‌ రెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలుచేసే వరకు ప్రశ్నిస్తూనే ఉంటామని తెలిపారు. ఆపార్టీని వదిలపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు.

Tags:    
Advertisement

Similar News