ఆర్మీ జవాన్ల వాహనం పేల్చివేత.. తొమ్మిది మంది మృతి

ఛత్తీస్‌గఢ్‌ లోని బీజాపూర్‌లో ఐఈడీ పేల్చిన మావోయిస్టులు

Advertisement
Update:2025-01-06 17:00 IST

ఆర్మీ జవాన్లు ప్రయాణిస్తున్న వాహనం టార్గెట్‌గా మావోయిస్టులు మందుపాతర పేల్చారు. ఈ ప్రమాదంలో తొమ్మిది జవాన్లు మృతిచెందగా పలువురు గాయపడ్డారు. వివరాలిలా ఉన్నాయి.. ఛత్తీస్‌గఢ్‌ లోని బీజాపూర్‌ జిల్లా కుత్రు అటవీప్రాంతంలో సోమవారం సుమారు 15 మంది ఆర్మీ జవాన్లతో వెళ్తోన్న వాహనాన్ని ఇంప్రువైజ్డ్‌ ఎక్స్‌ప్లోజివ్‌ డివైజ్‌ (ఐఈడీ)తో పోల్చివేశారు. పేలుడు ధాటికి రోడ్డుపై భారీ గుంత ఏర్పడగా ఆర్మీ వాహనం తుక్కుతుక్కయి.. శకలాలు దూరంగా పడ్డాయి. ఆర్మీ జవాన్లు దంతెవాడ, నారాయణపూర్‌, బీజాపూర్‌ జిల్లాల సరిహద్దుల్లో స్థానిక పోలీసులతో కలిపి జాయింట్‌ ఆపరేషన్‌ నిర్వహించారు. అటవీ ప్రాంతంలో కూంబింగ్‌ నిర్వహించి తిరుగు ప్రయాణమయ్యారు. వారి కోసం మాటువేసుకొని ఉన్న మావోయిస్టులు ఐఈడీని పేల్చేశారు. దీంతో తొమ్మిది మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. గాయపడ్డ వారిని బీజాపూర్‌ జిల్లా హెడ్‌ క్వార్టర్‌ హాస్పిటల్‌ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. శనివారం రాత్రి బస్తర్‌ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంట్‌ లో నలుగురు మావోయిస్టులు, ఒక పోలీస్‌ కానిస్టేబుల్‌ మృతిచెందారు. ఆ ఎన్‌కౌంటర్‌ కు ప్రతిఘటనగా ఆర్మీ వాహనాన్ని మాయివోస్టులు పేల్చివేశారు.

Tags:    
Advertisement

Similar News