ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి ఎన్‌కౌంటర్, ఇద్దరు మావోల మృతి
బీజాపూర్ జిల్లా బాసగూడ పరిధిలోని నేంద్ర అడవుల్లో చోటు చేసుకున్న ఘటన
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు హతమయ్యారు. యాంటి నక్సల్స్ ఆపరేషన్‌లో భాగంగా కేంద్ర బలగాలు బీజాపూర్ జిల్లా బాసగూడ పరిధిలోని నేంద్ర అడవుల్లో కూంబింగ్ చేపట్టగా మావోయిస్టులు తారసపడ్డారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. కాల్పుల అనంతరం ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి. కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతున్నదని బీజాపూర్ ఎస్పీ తెలిపారు. తాజా ఘటనతో బస్తర్ జిల్లాలో మరోసారి అలజడి చెలరేగింది. ఈ ఏడాది ఇప్పటివరకు 217 మంది మావోయిస్టులను హతమార్చామని వెల్లడించారు. గురువారం నారాయణపూర్ జిల్లాలో అబూజ్‌మడ్‌లో జరిగిన భీకర ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు హతమయ్యారు. 2026 కల్లా మావోయిస్టు కార్యకలాపాలను తుడిచిపెట్టాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకున్నది.