శ్రీతేజ్‌ ను పరామర్శించిన అల్లు అర్జున్‌

ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్న హీరో

Advertisement
Update:2025-01-07 10:19 IST

సికింద్రాబాద్‌ లోని కిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ ను హీరో అల్లు అర్జున్‌ పరామర్శించారు. డిసెంబర్‌ 4న రాత్రి పుష్ప -2 ప్రీమియర్‌ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో శ్రీతేజ్‌ తీవ్రంగా గాయపడగా, బాలుడి తల్లి రేణుక మృతిచెందారు. ఆరోజు నుంచి శ్రీతేజ్‌ కిమ్స్‌ హాస్పిటల్‌ లో చికిత్స పొందుతున్నాడు. ఆ చిన్నారిని పరామర్శించేందుకు తాను హాస్పిటల్‌ కు వస్తున్నానని, అనుమతి ఇవ్వాలని అల్లు అర్జున్‌ పోలీసులను కోరారు. పోలీసుల అనుమతితో సోమవారం ఉదయం హాస్పిటల్‌ కు చేరుకొని శ్రీతేజ్‌ ను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఆయన తండ్రితో మాట్లాడి ధైర్యం చెప్పారు. అల్లు అర్జున్‌ వెంట ఎఫ్‌డీసీ చైర్మన్‌, నిర్మాత దిల్‌ రాజు ఉన్నారు. అల్లు అర్జున్‌ వస్తుండటంతో హాస్పిటల్‌ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Tags:    
Advertisement

Similar News