చంచల్ గూడ జైలు నుంచి అల్లు అర్జున్ విడుదల

హైకోర్టు నుంచి బెయిల్ పత్రాలు లేటుగా రావడంతో రాత్రంతా జైలులోనే బన్ని

Advertisement
Update:2024-12-14 08:04 IST

సినీ నటుడు అల్లు అర్జున్ చంచల్ గూడ జైలు నుంచి శనివారం ఉదయం విడుదలయ్యారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ ను పోలీసుుల శుక్రవారం అరెస్టు చేశారు. ఈ కేసులో నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో ఆయనను చంచల్ గూడ జైలుకు తరలించారు. మరోవైపు తెలంగాణ హైకోర్టు నాలుగు వారాలపాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఆయన న్యాయవాదులు రూ. 50 వేల పూచీకత్తును జైలు సూపరింటెండెంట్ కు సమర్పించారు. అయితే హైకోర్టు నుంచి బెయిల్ పత్రాలు జైలు అధికారులకు శుక్రవారం రాత్రి ఆలస్యంగా అందాయి. దీంతో బన్ని రాత్రంతా జైలులోనే ఉన్నారు. ప్రక్రియ ఆలస్యం కావడంతో శనివారం ఉదయం అల్లు అర్జున్ జైలు నుంచి విడులయ్యారు. ఎస్కార్ట్ వాహనం ద్వారా ఆయనను పంపించారు. అల్లు అర్జున్ జైలు నుంచి నేరుగా గీతా ఆర్ట్స్ కార్యాలయానికి చేరుకున్నారు. ఆ తర్వాత జూబ్లీహిల్స్ లోని ఇంటికి రానున్నారు. ఈ నేపథ్యంలో ఆయన నివాసం వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు.

Tags:    
Advertisement

Similar News