ఖమ్మంలో క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో యువకుడి మృతి
క్రికెట్ ఆడుతున్న యువకుడు హఠాత్తుగా గుండెపోటుతో మృతి చెందాడు
ఖమ్మం జిల్లాలో క్రికెట్ ఆడుతున్న యువకుడు హఠాత్తుగా గుండెపోటుతో మృతి చెందాడు. కూసుమంచి మండల కేంద్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక్కడ క్రికెట్ టోర్నమెంట్ జరుగుతోంది.ఈ టోర్నమెంట్‌లో విజయ్ అనే యువకుడు ఒక్కసారిగా మైదానంలో పడిపోయాడు. దీంతో నిర్వాహకులు అతనిని ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు గుండెపోటు కారణంగా మృతి చెందినట్లు తెలిపారు. దీంతో టోర్నమెంట్ ప్రాంగణంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
దీంతో.. స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుడు విజయ్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ మధ్యకాలంలో కాలంలో గుండెపోటు కేసులు గణనీయంగా పెరిగాయి. 20 నుంచి 40 ఏళ్ల మధ్య వయసున్న వారు గుండెపోటుకు గురవుతున్నారు. చాలా సందర్భాలలో, వ్యక్తి అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోతున్నారు. జిమ్‌లో వర్కౌట్స్ చేస్తున్న సమయంలో గానీ, డ్యాన్స్ చేస్తున్నప్పుడు గానీ గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు.